ఈ సందేశంలో పాస్టర్ బెన్ కొమానపల్లి జూనియర్ గారు విమోచన మనకు దేవుని ఆశీర్వాదమనే ద్వారంగా ఎలా మారుతుందో తెలుపుతున్నారు. ఇక్కడ వారు శాపాలు, ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ, శాపాలు కాదు కానీ, ఆశీర్వాదాలే మన పట్ల దేవుని ప్రణాళిక అని మనకు తెలియజేస్తున్నారు. దేవుడు మన క్షేమాన్నే కోరి, మనలను ఆశీర్వదిస్తాడు.
క్రీస్తు మనలను శాపము నుండి విమోచించి, మనము ఆశీర్వదించబడునట్లుగా తానే శాపముగా మారాడు.
ఒక విశ్వాసి ఏ శాపగ్రస్తమైన పరిస్థితి లేదా సందర్భము కింద జీవించాల్సిన అవసరం లేదు. ఈ సత్యాన్ని విశ్వాసమే తెరుస్తుంది.