సుమారు 600 సినిమాలకు సుమధురస్వరాలు కూర్చిన 'మామ ' సినీరంగ ప్రవేశం జూనియర్ ఆర్టిస్ట్ గా! సంగీత దర్శకత్వం చేసిన మొదటి మూడు సినిమాలు పరాజయం పాలవడంతో సినిమారంగం నుంచీ నిష్క్రమించారు. నాలుగేళ్ళ తర్వాత మొదలైన రెండో ఇన్నింగ్స్ 40 సంవత్సరాల పాటు దిగ్విజయంగా కొనసాగింది. తమిళ సినిమాల్లో ఆరేళ్ళు పనిచేసిన తర్వాతే డైరెక్ట్ తెలుగు సినిమాకి సంగీతదర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నాలుగేళ్ళకి మంచిమనసులు చిత్రంతో స్టార్డమ్ అందుకున్నారు. తెలుగు చదవడం, వ్రాయడం ఎలాను రాదు సరే, తొలిసంవత్సరాల్లో తెలుగు మాట్లాడ్డం కూడ సరిగా వచ్చేది కాదట. ఆ రోజుల్లో ఆయన స్వరాలు కూర్చినవే మంచి మనసులు, మూగ మనసులు లాంటి సినిమాల్లోని పాటలు..కె.వి.మహదేవన్ గారి గురించి ఇంకెన్నో ఆసక్తికరమైన విశేషాలు - ఈ మొదటి భాగంలో వినండి